నీకు నీవుగా నన్ను చూడగా – Neeku neevuga
Shop Now: Bible, songs & etc
నీకు నీవుగా నన్ను చూడగా – Neeku neevuga
పల్లవి: నీకు నీవుగా నన్ను చూడగా
పరము నుండి దిగివచ్చిన వయా
నాపై ఇంతగా ప్రేమ చూపగా
నేనంతటి వాడను యేసయ్య”2″
పండుగ ఇది క్రిస్మస్ పండుగ
గుండెల నిండుగా ఆనందం పండేగా”2″ (నీకు)
1. శాప దోషమును పరిహరించగా
దీనుడై దిగి వచ్చినావయ్యా”2″
పాడైపోయిన నా స్థితి మార్చగా
శరీరాన్ని దాల్చుకున్న యేసయ్య”2″ (పండుగ)
2. నిత్యజీవమును అనుగ్రహించగా
దాసుడై దిగి వచ్చినావయ్యా”2″
తండ్రి ఇంటికి దారిని చూపగా
ప్రభావాన్ని వదులుకున్న యేసయ్య”2″ (పండుగ)
3. పాప లోకమును కనికరించగా
బాలుడై దిగి వచ్చినావయ్యా”2″
మంటివానితో స్నేహము చేయగా
స్వరూపాన్ని మార్చుకున్న యేసయ్య”2″ (పండుగ)