హృదయమంత – Hrudayamantha lyrics
హృదయమంత – Hrudayamantha lyrics
ప: హృదయమంత గంతులు వేసే – ఉత్సాహం ఉరకలు వేసే
చర్చి నిండ జనులను చూసే – ఎన్నడూ చూడని మనిషోచ్చే
క్రిస్మస్ మరలా వచ్చింది – క్రిస్మస్ గీతాలు పాడే ఘడియొచ్చేసింది
క్రిస్మస్ మరలా వచ్చింది – క్రిస్మస్ వేషాలు వేసే ఘడియొచ్చేసింది
ఎటు చూసిన రంగులే – ఖరీదైన దుస్తులే
పరిశుద్ధత ఒక్కటే – అందరిలో కొదువలే
వింతైన స్టారులు – కనిపించే రోజులు
వేషధారులు వేసే – చిందులు విందులతో /హృదయమంత/
1. ఒంటెల పైన ఎడారులలోన – జ్ఞానులు వచ్చారు
ఆరాధించుటకు
కారులు ఉన్నా – రహదారులు ఉన్నా
ఆదివార ఆరాధన – గుర్తులేని జనులకు //2//
2. యువతగా ఉన్న – పురుషుని ఎరుగక ఉన్న –
మరియ తల్లిలా – బ్రతకని యువతులకు
యవ్వనుడైన – నీతిమంతునిగున్న
యోసేపులా ఉండని యువకులకు //2/ //హృదయమంత//
3. బోధకులెంతో బోధతో – బుద్ధి చెప్పినా
పాపము మానని – పండుగ భక్తులకు
రెండవ రాకడ కొరకై – సిద్దము కాక
తినుచుత్రాగుచు – గంతులు వేయుటకొరకు (2)
సమయమిది కాదు సోదరా -ప్రభు రాకడ దగ్గరాయెరా
ఈ లోకమసలు- నిజము కాదురా
మరణముంది – మార్పు చెందారా
క్రిస్మస్ క్రిస్మస్ ప్రియ క్రిస్మస్ – మార్పు చెందడమే నీవు నిజ క్రిస్మస్
క్రిస్మస్ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ – రక్షణ పొందడమే నీవు నిజ ఆనందమే
యేసయ్యతో విందులే – పసందైన రోజులే
పరిశుద్ధత ఒక్కటే – ఉంటే ఇవి నీవేలే
ప్రార్ధించే పెదవులు – ఘనపరచే గళములు
ఇవి అన్ని ఉంటేనే – నిజమైన క్రిస్మస్సే
హృదయమందు – యేసు ఉండాలి
ఆత్మతోనే – ఆరాధించాలి
అంధకారం – అంతరించాలి
ప్రభు సన్నిధి – నానందించాలి