Entha Manchi Vaadavu – ఎంతమంచివాడవు ఎంత గొప్ప
Shop Now: Bible, songs & etc
Entha Manchi Vaadavu – ఎంతమంచివాడవు ఎంత గొప్ప
ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా దేవాధి దేవుడవు రాజాధిరాజువు నీవుంటే నాకు చాలయ్యా యేహెూవా. యహోవా. యోహెూవా నా కాపరి యేహెూవా. యహోవా. యోహెూవా నా ఊపిరి
పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు కన్నీటిని తుడిచావు కష్టాలే తీర్చావు నీ మాటలో గొప్ప శక్తుందిలే ఆ పిలుపు లాజరును లేపిందిలే నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
సంద్రాన్ని శాసించి శాంతింప జేసావే పాపులను స్నేహించి పవిత్రులుగా మార్చివే నీ పేరంటే దయ్యాలు వణికాయిలే నీవంటే రోగాలు జడిసాయిలే నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే నీతిగా జీవించే బోధలెన్నో చేశావే కల్వరిలో నీ ప్రేమ చూపావులే కలుషాత్ములెందరినో మార్చావులే నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేడులే (2)
" The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."