Home » Blog » Gamyam Cheralani Nitho Undalani Pagalu Reyi Paravasinchalani – గమ్యం చేరాలని నీతో ఉండాలని Gamyam Cheralani Nitho Undalani Pagalu Reyi Paravasinchalani – గమ్యం చేరాలని నీతో ఉండాలని
Gamyam Cheralani Nitho Undalani Pagalu Reyi Paravasinchalani – గమ్యం చేరాలని నీతో ఉండాలని
గమ్యం చేరాలని నీతో ఉండాలని
పగలూ రేయి పరవశించాలని
ఈ నింగి నేలా కనుమరుగైనను
శాశ్వత జీవం పొందాలని
సాగిపోతున్నాను నిన్ను చూడాలని
నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం||
భువి అంతా తిరిగి జగమంతా నడచి
నీ జ్ఞానముకు స్పందించాలని
నాకున్నవన్ని సమస్తం వెచ్చించి
నీ ప్రేమ ఎంతో కొలవాలని
అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో
అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగి||
అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన
శిరమును వంచి సహించాలని
వేదన బాధలు గుండెను పిండిన
నీదు సిలువనే మోయాలని
నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి
నీ సేవలో నే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగి||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are (Adapted from multiple sources)for personal and educational purposes only."