![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Neeve Krupadharamu Triyeka Deva – నీవే కృపాధారముత్రియేక దేవా
Neeve Krupadharamu Triyeka Deva – నీవే కృపాధారముత్రియేక దేవా
నీవే కృపాధారముత్రియేక దేవా
నీవే క్షేమాధారము నా యేసయ్యా /2/
నూతన బలమును నవ నూతన కృపను /2/
నేటివరకు దయచేయుచున్నావు – నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా
ఈ స్తోత్ర గీతము నీకేనయ్యా .. /నీవే/
ఆనందించితిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను /2/
ఆకర్షించితివి ఆకాశముకంటె ఉన్నతమైన నీ ప్రేమను చూపి /2/
ఆపదలెన్నో అలముకున్నను – అభయము నిచ్చితివి
ఆవేదనల అగ్నిజ్వాలలో అండగ నిలచితివి
ఆలొచనవై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు
నీకే ఈ ప్రేమగీతం అంకితమయ్యా
ఈ స్తోత్ర గీతం అంకితమయ్యా /2/నీవే/
సర్వకృపానిధి – సీయోను పురవాసి – నీ స్వాస్థ్యముకై నను పిలచితివి /2/
సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను – సహనము కలిగి /2/
శిధిలముకాని సంపదలెన్నో నాకై దాచితివి
సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి
సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకేనయా /నీవే/
ప్రాకారములను దాటించితివి – ప్రార్ధన వినెడి పావనమూర్తివి /2/
పరిశుద్ధులతో నను నిలిపితివి – నీ కార్యములను నూతన పరచి /2/
పావనమైన జీవనయాత్రలో విజయము నిచ్చితివి
పరామరాజ్యములో నిలుపుటకొరకు అభిషేకించితివి
పావనుడా నా అడుగులు జారక స్థిరపరచినావు
నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా – ఈ స్తోత్ర గీతము నీకెనయా /నీవే/