Neraverchithiva Nee Thandri Chitthamu – నెరవేర్చితివ నీ తండ్రి చిత్తము
Neraverchithiva Nee Thandri Chitthamu – నెరవేర్చితివ నీ తండ్రి చిత్తము
పల్లవి :
నెరవేర్చితివ నీ తండ్రి చిత్తము
నలిగిపోతివ ఈ ప్రజల కోసము “2”
యేసయ్య నీ మరణవేదన “2”
మాకు విమోచన కలిగినది “2” (నేరవేర్చితివ)
చ :
పాపము ఎరుగని నీపై
పాప భారమును మోపితిమి
దోషం ఎరుగని నిన్ను
దోషిగా నిలబెట్టితిమి “2”
అవమానాలనే భరియించితివి
అపనిందలనే సహియించితివి “2”
విలువ తెలియని మా కొరకు
విలువైన నీ కృపను చూపితివి
విలువైన నీ కృపను చూపితివి _(నెరవేర్చితివ)
చ :
నేరం ఎరుగని నిన్ను
నేరస్థునిగా చేసితిమి
దోషమైన మాటలతో నిన్ను
దూషించితిమి”2″
అన్యాయపు తీర్పును తీర్చితిమి
కఠినమైన శిక్షను విధించితిమి”2
అర్హత లేని మా కొరకు
అమూల్యమైన రక్తమును
చిందించితివి (నెరవేర్చితివ)
చ :
స్వార్థం లేని నీ ప్రేమను
తూలనాడితిమి
వెలకట్టలేని నీ కృపలను
విడనాడితిమి”2″
కల్లాకపటం లేదు నీ కనులలో
మాయమర్మము తెలియదు
నీ ప్రేమలో
అమర లోకానికి చేర్చుటకు
నీవే వారధిగా మారితివి
నీవే వారధిగా మారితివి (నెరవేర్చితివ)