![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
ప్రాణమైనావే నా యదలోన – Pranamainave Naa Priyadeva
ప్రాణమైనావే నా యదలోన – Pranamainave Naa Priyadeva
పల్లవి:
ప్రాణమైనావే నా యదలోన
ఊపిరైనావే నా ప్రియ దేవా
వీడిపోని బంధమై యద చప్పుడైతివే
మదిలోని స్నేహమై అనుబంధమైతివే – (ప్రాణమైనావే)
చరణం 1
చీకటందు దీపమాయే నాదు జీవితం
నీదు కాంతి నాకు సుకృతం
లోకమందు జీవమాయే శేష జీవితం
నాదు జన్మ నీకు అంకితం
నా గుండెలోన నీవే ప్రాణమైనావే
నా హృదయ స్పందన నీవే
నా కళ్ళలోన నీవే కనుపాపవైనావే
నా కళ్ళలో దీపము నీవే – (వీడిపోని)
చరణం 2
వేదనందు నెమ్మదాయే నాదు హృదయము
నీదు శాంతి నాకు ఔషధం
ఆపదందుక్షేమమాయే క్షామ జీవితం
నాదు ఆత్మ నీకు అర్పితం
ప్రతినాడిలోన నీవే రక్తమైనావే
నా ప్రాణ ఆత్మవు నీవే
నా దేహమంతా నీవే నిండి యున్నావే
నా ఆత్మలొ జీవము నీవే – (వీడిపోని)