![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Silvalo Naskai Karchenu Yesu Rakthamu – సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
Silvalo Naskai Karchenu Yesu Rakthamu – సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
అమూల్యమైన రక్తము యేసు రక్తము ||సిల్వలో||
1.సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము
సంధి చేసి చేర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము ||సిల్వలో||
2.సమాధాన పరచును యేసు రక్తము
సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము ||సిల్వలో||
3.నీతిమంతులుగా చేయును యేసు రక్తము
దుర్ణీతినంత బాపును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
నిబంధన నిలుపును రక్తము యేసు రక్తము ||సిల్వలో||
4.రోగములను బాపును యేసు రక్తము
దురాత్మల పారద్రోలును యేసు రక్తము
యేసు రక్తము ప్రభు యేసు రక్తము
శక్తి బలము నిచ్చును యేసు రక్తము ||సిల్వలో||