![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Vijaya Samsthutule Niku – విజయ సంస్తుతులే నీకు
Vijaya Samsthutule Niku – విజయ సంస్తుతులే నీకు
విజయ సంస్తుతులే నీకు – ప్రేమస్వరూప
విజయసంస్తుతులు నీకు -జయమే లభించు నీకు
విశ్వమంతట సర్వదీక్ష – ప్రజల వలన నిత్యమయిన
ప్రణుతులు సిద్ధించు నీకు
నేడు మా పనులెల్లను దీవించుము నిండుగా వర్ధిల్లును
చూడ వచ్చిన వారికిని బహు శుభకరంబుగా నుండునటుల
కీడు బాపుచు మేళ్ళను – సమకూడ జేసిన నీకే కీర్తి
ఆటలాడుకొన్నను నీ నామమున – పాటల్పాడుకున్ననను
నాటకంబుల్ కట్టుకున్నను నాట్యమాడుచు మురియుచున్నను
కూటములను జరుపుకున్నను – నీటుగను నీకేను కీర్తి
పరలోకమునకీర్తి – దేవా నీకే ధరణియందున కీర్తి
నరుల హృదయము లందుకీర్తి – పరమదూతలందుకీర్తి
జరుగు కార్యము లందుకీర్తి – జరుగని పనులందు కీర్తి