Shop Now: Bible, songs & etc
Yekkada Yekkada – ఎక్కడా ఎక్కడా
పల్లవి :- ఎక్కడా ఎక్కడా
నా పాపాలకు పరిహారమెక్కడా…
ఎక్కడా ఎక్కడా
నా ప్రాణానికి రక్షకుడు ఎక్కడా.|
నా కన్నీటితో పన్నీరునే పట్టి
నీ కొరకై పరుగులెత్తనా | 2
||ఎక్కడ||
చరణం :- వేవేల మంది నన్ను చూడనీ
హేలనలే నన్ను చెయ్యనీ ..
నా గర్వమే నన్ను ఆపినా
పాపపు కట్లనే తెంచుతున్న… | 2 |
*నీ పాదాల వైపే నా గురీ
నా పాపలకే ఈ ఊరీ.. | 2 |
||ఎక్కడ||
చరణం 2 :- ఎంతగా నేను ఏడ్చినా
నీ పాదాలను కడుగ జాలను …
నా కురులతో ఎంత తుడిచినా
నీ పాదాల దుమ్మునే కదా.. … | 2 |
*కారుచున్న కన్నీటి సెగలే
నా పాపాలను విరువ జాలవూ ….
*కారుచున్న నీ పాద రక్తమే
నా పాపాలను పరిహరించును… | 2 |
||ఎక్కడా||