చింత లేదిక యేసు పుట్టెను – chintha ledika yesu puttenu
Shop Now: Bible, songs & etc
చింత లేదిక యేసు పుట్టెను – chintha ledika yesu puttenu
చింత లేదిక యేసు పుట్టెను – వింతగను బెత్లెహేమందున
చెంతజేరను రండి సర్వజనంగమా – సంతస మొందుమా -చింత
1.దూత తెల్పెను గొల్లలకు శుభవార్త నా దివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసుని గాంచిరి – స్తుతు లొనరించిరి – చింత
2.చుక్కగనుగొని జ్ఞానులెంతో మక్కువతో నా ప్రభుని గనుగొని
చక్కగా బెత్లెహెము పురమున జొచ్చిరి – కానుక లిచ్చిరి – చింత
3.కన్య గర్భమునందు బుట్టెను – కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై – సర్వమాన్యులై -చింత
4.పాప మెల్లను పరిహరింపను – పరమ రక్షకుడవతరించెను
దాపు జేరిన వారి కీడు గడు భాగ్యము – మోక్షభాగ్యము
Tags: telugu christian songs