Aradhana Aathma Devunike – వీదుల్లో నాట్యమాడి ఆరాదిస్తా
Aradhana Aathma Devunike – వీదుల్లో నాట్యమాడి ఆరాదిస్తా
దావీదులా
వీదుల్లో నాట్యమాడి ఆరాదిస్తా
దానియేలులా గదిలో మోకరించి స్తుతియిస్తా
దండనకై బంది అయిన పౌలులాగ పాడిస్తుతిస్థా
వుండిన ఈ జీవితమంతా నిండుగ నిను కీర్తిస్తా
ఆరాధనా ఆత్మ దేవునికే
ఆరాధనా ప్రేమస్వరుపునికే
ఆరాధనా పరిశుద్ద దేవునికే
ఆరాధనా పరిపూర్ణ దేవునికే
సుతునిగ వచ్చిన దేవునికే…
మృతుడై లేచిన దేవునికే….
హృదిరం కార్చిన దేవునికే….
నా హృదయం మార్చిన దేవునికే…
మేడిచెట్టు దిగివస్తా – మేడగది ఎక్కేస్తా
ఆశలన్ని వదిలేసి – భాషలతో స్తుతియిస్తా
కుండ బండపై పడవేస్తా – ఆపకుండ పరుగులు తీస్తా
నోటినిండ స్తుతి చెల్లిస్తూ – ఊరి నిండ ప్రకటిస్తా
ఆరాధనా ఆత్మ దేవునికే
కుష్ఠు వ్యాధి తొలగించావని – ఇష్టంగా తిరిగొస్తా
దృష్టి నాకు ఇచ్చినందుకు – స్పష్టంగా నినుచూస్తా
దుష్ట సేన పారద్రోలగా – శ్రేష్ఠుడనై నిలిచుంట
బ్రష్టబ్రతుకు మార్చివేయగా – నిష్టకలిగి జీవిస్తా.
ఆరాధనా ఆత్మ దేవునికే
ఆరని ఆ మంటలో – కాలని ఆ యవనస్తుల్లాగా
ఆరిన దారిలో తీరం – చేరిన నీ మనుషుల్లాగా
విశ్వాసంతో విజయాలను పొందిన ఆ వీరుల్లాగా
పరిచర్య కోసం ప్రాణం పెట్టిన పరిశుద్ధుల్లాగా
ఆరాధనా ఆత్మ దేవునికే