![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
కన్నీరెంత ఒలికినా నీ రూపం చెరుగునా – Kannirenta Olikina Ni Rupam Ceruguna
కన్నీరెంత ఒలికినా నీ రూపం చెరుగునా – Kannirenta Olikina Ni Rupam Ceruguna
ఆగేదెలా ఈ కన్నీరు….. గుండే మరువగలదా నీ ప్రేమ తీరూ….
పల్లవి:- కన్నీరెంత ఒలికిన నీ రూపం చేరగునా..
దినములెన్ని గడచిన జ్ఞాపకాలు చెదురునా——2
ఓ.. సేవకా క్రీస్తు సైనికా- ప్రేమ ఒలికిన కలశమా…
ప్రతి శ్వాసలో నీ.. ఊసులే -తేనె అంత మధురమా.. “కన్నీర”
చరణం–1: పని ఉందని అన్నావు-ప్రకటిస్తూ బ్రతికావు
శవమై చేదు నిజమై – మంమొదలి వెళ్లావు
నీపాటని విన్నాము-నీ బాటను చూసాము
నీ.. ప్రేమే మాకు తరగని-వరమై తలచాము
ఇంతలో ఏమయ్యిందో ఈ ఘోరం-పసికందైన సహించేనా నీ మరణం……2*
ఎవరిలో చూడాలి నీ ప్రేమ రూపం-ఏమని చెప్పాలి అది ఎండ మావి తీరం… * కన్నీరెంత *
చరణం.2:- సంచలనం నీ చరణం-అది మధురం నీ వాక్యం
అంత లొనే ఆగిపోయే-అలుపులేని నీ పయనం
ప్రతి పాట ఓ పాటం – క్రైస్తవునికి గుణపాఠం
కోటికొక్కరు నీ తీరు- సరిలేరు నీ కెవ్వరు…
ప్రతి మది తడిచెను నీ తలపుతో-ఈ వేళ
ప్రభువే చెలిమై పరదేశుకు నువు చేరవా–2
ఎన్నాళ్ళైనా నిను మరువను నేస్తం-కడవరకు నీ పలుకు పదిలం సత్యం…. * కన్నీరెంత*