MEM KRAISTHAVULAM -ప్రేమ క్షమలను సమపాళ్లుగా
MEM KRAISTHAVULAM -ప్రేమ క్షమలను సమపాళ్లుగా
ప్రేమ క్షమలను సమపాళ్లుగా
విశ్వాసమే లక్ష్యంగా మా జీవితాలనే సాక్ష్యంగా
నిజదేవుని జనాంగంగా పిలువబడిన వారమే మేము సిగ్గుపడని వారమే మేము 2
మేం క్రైస్తవులం క్రీస్తనుచరులం మేం క్రైస్తవులం ప్రేమకు జ్ఞాపికలం మేం క్రైస్తవులం పరలోక దీపికలం మేం క్రైస్తవులం బాధ్యత గల పౌరులం మేం క్రైస్తవులం క్రైస్తవులం
1. మతానికి అతీతులం జాతి వర్ణ వర్గాలనేకం
మేం యేసు రక్తంతో కొనబడిన వారం
మేం సత్యమార్గంలో నడిచే వారం 2
యేసు నీ జీవితమే మాకు పాఠంగా
మా బ్రతుకులకే ఒక యాగంగా
చేసుకొన్న వారమే మేము
ఏక శరీరమై ఉన్నాము 2 “ప్రేమ”
2. మనుషులను ప్రేమిస్తాము
దైవ ప్రేమనే ప్రకటిస్తాము
ఏ శోధనకైనా తలవంచని వారం
దేవుని చెంత మోకరించేవారం 2
లోకం మమ్ములను వేధిస్తున్నా
చులకనగా చూసి నింధిస్తున్నా
బాధను సహించే వారం
మేం శత్రువునైన క్షమిస్తాము 2
పాపం అంటే శరీరంతో చేసేదే కాదు మనసులో తలంచేది అంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం
ఏ మనిషి దేవుని రూపాన్ని చూడలేదు అందుకే
విగ్రహారాధన మేం చెయ్యం ఎందుకంటే మేం క్రైస్తవులం
దేవుడంటే సృష్టిని చేసిన వాడు ఆ దేవునికి విదేశీ దేవుడనే మాటే లేదంటాం ఎందుకంటే మేం క్రైస్తవులం
ఎన్ని బాధలు పెట్టి హింసించినా ప్రేమతో క్షమిస్తాము ఎందుకంటే మేం క్రైస్తవులం “ప్రేమ”
- Rakshakudu Sri Yesudu – మేలుకో సోదరుడా యేసయ్య మనకై పుట్టాడని
- దూత వార్త తెలిపింది – క్రిస్మస్ సాంగ్
- கண்ணான கண்ணே கன்னி மரி – Kannana Kanne Kanni Mari
- சின்னஞ்சிறிய குடிலிலே – Chinna Chiriya Kudililey
- Yesu Nee Krupayega – దేవా నీ కృప పొందుటకు