![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
ఆనందం ఆదరణ – Anandam Aadarana
ఆనందం ఆదరణ – Anandam Aadarana
పల్లవి:
ఆనందం ఆదరణ దయచేయుమా
మనసులో నెమ్మది కలిగించుమా – 2
నీ చల్లని చేతులతో నన్ను తాకుమా
నీ రెక్కల క్రింద నన్ను దాయుమా – 2
నా ప్రాణం నా ఊపిరి నీవే
నా బలము నా ధైర్యము నీవే – 2
చరణం: 1
నా క్రియలు నా తలంపులు నీకు తెలిసియున్నవి
నిన్నే విశ్వసించి నీ మార్గములోనే నడుచుచున్నాను – 2
నా కార్యములు నెరవేర్చుము – నా అడుగులను స్థిరపరుచుము – 2
చరణం: 2
నీవు దయాళుడవు మేలుచేయుమ కనికరించుమా
పడిపోయిన నా జీవితాన్ని తిరిగికట్టుమా – 2
మూయబడిన ద్వారములు – తెరువుము యేసయ్యా – 2
చరణం: 3
ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు
రాత్రంతయు నీ సముఖములో ప్రార్ధించుచున్నాను – 2
దేవా నా మొఱ్ఱ ఆలకించుము – నా చింతలను తొలగించుము – 2