![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Samipincharani Tejassulo Neevu Vasiyinchu Vadavaina – సమీపించరాని తేజస్సులో నీవు
Samipincharani Tejassulo Neevu Vasiyinchu Vadavaina – సమీపించరాని తేజస్సులో నీవు
సమీపించరాని తేజస్సులో నీవు
వసియించు వాడవైనా
మా సమీపమునకు దిగి వచ్చినావు
నీ ప్రేమ వర్ణింప తరమా (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీ||
ధరయందునేనుండ
చెరయందు పడియుండ
కరమందు దాచితివే
నన్నే పరమున చేర్చితివే (2)
ఖలునకు కరుణను నొసగితివి (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీ||
మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి
నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2)
తులువకు విలువను ఇచ్చినది (2)
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీ||