నింగిలోనా మెరిసే-నక్షత్రం – Nihilona merise nakshathram
నింగిలోనా మెరిసే-నక్షత్రం
లోకమంతటికి-వెలుగును చూప – (2)
యేసయ్య-పుట్టాడని
ఆయనే-రక్షకుడని – (2)
పూజించి-కొనియాడి
పూజించి-కొనియాడి ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయనే పరలోకానికి దారాయనే -(2)
1.నశియించి పోతున్న లోకాన్ని చూసి
చీకటిలో ఉన్న నరులను చేర (2)
వాక్యమైయున్న దేవుడు
దీనుడై భూవికివచ్చినాడు (2)
పూజించి కొనియాడి
పూజించి కొనియాడి ఆరాధన చేద్దాం
లోకానికి వెలుగాయెనే
పరలోకానికి దారాయెనే (2)
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ
ఆయన కిష్టులైన ప్రజలందరికి సమాదానము…
2.పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే – (2)
కరములు చాచి యున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు -(2)
పూజించి కొనియాడి
పూజించి కొనియాడి
ఆరాధనా చేద్దాం
లోకానికి వెలుగాయనే
పరలోకానికి దారాయనే -(2)
“నింగిలోనా మెరిసే నక్షత్రం”

