
నిర్మలుడా యేసయ్యా – Nirmaluda Yesayya Telugu new year song lyrics
నిర్మలుడా యేసయ్యా – Nirmaluda Yesayya Telugu new year song lyrics
నిర్మలుడా యేసయ్యా – నీ వాక్యమే నా ఆధారం
నా దీవెనకు తొలి సంతకమై
దీన స్థితిలో శుభ సంకేతమై
నడిపించినది నీ బాహువే… బలపరిచినది వాగ్దానమే …
ప్రతికూల స్థితిలో సహకారిగా – ప్రతి స్థలమందు సారధిగా
నవ నూతనమైన కార్యములెన్నో – నా జీవితములో చేసిన దేవా
ఊహించలేనివి నీ మేలులు వర్ణించలేనివి
విస్తారమైనవి నీ తలంపులు – నా యెడ స్థిరమైనవి
సమ్మతిలేని పోరాటాలు – సహనము వీడే మాటల కెరటాలు
సదయుడవై నా ప్రక్క నిలిచి – సమృద్ధితో సమాధానమిచ్చావు
సరిహద్దు లేనిది ని ప్రేమ – సరిపోల్చలేనిది
స్తుతియింతు నీ కీర్తిని సజీవుడా – ఘనపరతు నీ ఖ్యాతిని
గడిచిన కాలం నీ కనికరమే – నా ప్రతి క్షణము నీ దయలోనే
ఉన్నతమైన ఉద్దేశములెన్నో – నెరవేర్చుటకై బ్రతికించితివి
నీ ప్రేమ సంకల్పమే నా యెడ – నీ కృప వాత్సల్కమే
ఆరాధింతు స్తుతి గీతమై అజేయుడా సేవింతు సంకీర్తనై.