Naa Thodugaa – నా తోడుగా నీవుండగా
నా తోడుగా నీవుండగా నాకేల భయము నా యేసువా
నీ నీడలో నను కాయుమా నీకే వందనం నా యేసువా
చ.1
గాడాంధకారంలో పడియుంటిని
ఆదరించువారే లేకుంటిని
ఎందుకో నాపై నీ దయ చూపితివి
ఎలా మరచిపోనయ్యా నీ ప్రేమను
ఎందుకో నాపై నీ దయ చూపితివి
ఎలా మరచిపోనయ్యా నీ ప్రేమను
చ.2
తల్లి మరచిన మరువనంటివి
తండ్రి విడచిన విడువనంటివి
తల్లితండ్రిగా నన్ను ఆదరించితివి
నీవేనా శరణమని వేడుకుంటివి
తల్లితండ్రిగా నన్ను ఆదరించితివి
నీవేనా శరణమని వేడుకుంటివి
చ.3
నాకొరకు నీవుశ్రమపొందితివి
నా పాప జీవితము తుడిచివేతివి
బలియై పోతివా నాకోసము
వెలియైనావా మా కోసము
బలియై పోతివా నాకోసము
వెలియైనావా మా కోసము
Naa Thodugaa Neevundaga Telugu Christian Song lyrics
