Payanamayyindi Taara Telugu Christmas song lyrics – పయనమయ్యింది తార

Faith Score0
Faith Score0

Payanamayyindi Taara Telugu Christmas song lyrics – పయనమయ్యింది తార

పల్లవి:
పయనమయ్యింది తార మనకై సాక్ష్యమిచ్చేందుకు
పరలోకసైన్యమే కదిలివచ్చింది ఋజువుచూప మనకు
దావీదు పట్టణమందు రారాజు ఉదయించెగాలోకానికే రక్షణ అనుగ్రహించేందుకు “2”

చరణం 1:-
నీతి స్థాపింప లోకమందున కన్యగర్భమెంచి
ఆ గర్భమునే పరిశుద్ధాత్మచే ఆశీర్వదించి “2”
మట్టినుండి ఆదామును చేసిన సమర్థుడగు ఆ దేవుడే
కన్యమరియ గర్భమునందే ఆ యేసునే రూపించెనే (2)
సూచనే మనకు చూపెనే “పయనమయ్యింది”

చరణం 2:
దారిద్ర్యమందున్న మానవులను ధనవంతులు చేయుటకు
ఐశ్వర్యవంతుడు యేసుక్రీస్తుడే దీనుడిగా వచ్చే (2)
వెలకట్టలేని తన రక్తమునే మన పాపము కొరకై చెల్లించి
విలువేలేని మన బ్రతుకులను తన వాక్యధనముతో హెచ్చించే (2)
ఆస్తికర్తలుగా దీవించే “పయనమయ్యింది”

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo