Gadachina Kalamantha – వందనాలు వందనాలు దేవా నీకే వందనం

Faith Score0
Faith Score0

Gadachina Kalamantha – వందనాలు వందనాలు దేవా నీకే వందనం

వందనాలు వందనాలు దేవా నీకే వందనం
కోట్లాది స్తోత్రాలకు అర్హుడా వందనం – 2
గడచిన కాలమంతా కృపలో మము కాపాడిన
శ్రీ యేసు రాజా నీకే వందనం
దేవాది దేవా నీకే వందనం – 2

1. ప్రతి సమయమందు నీ వాత్సల్యత చూపి
సమాధానమిచ్చి దీర్ఘాయుష్షిచ్చినావు -2
మాయెడల నీకున్న నీ తలంపులు
లెక్కింపజాలని బహువిస్తారములు – 2

శ్రీ యేసు రాజా నీకే వందనం
దేవాది దేవా నీకే వందనం – 2

2. ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొను వాడవు
చంక పెట్టుకుని నన్ను రక్షించువాడవు – 2
నీ మాటతో నన్ను బలపరిచినావు
పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు – 2

శ్రీ యేసు రాజా నీకే వందనం
దేవాది దేవా నీకే వందనం – 2

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo