
Jeevapradatha Lyrics – జీవప్రధాతవు
Jeevapradatha Lyrics – జీవప్రధాతవు
జీవప్రధాతవు నను రూపించిన శిల్పివి నీవేప్రభు
జీవనయాత్రలో అండగానిలిచే తండ్రివి నీవేప్రభు
జగములనేలే మహిమాన్వితుడా నా యెడ నీకృపను
జాలిహృదయుడా నాపై చూపిన వీడని నీ ప్రేమను
ఏమని పాడేదనూ
ఏమని పొగడెదను – “జీవప్రధాతవు”
1.శుభకరమైన తొలిప్రేమనునే
మరువక జీవింప కృపనీయ్యవా “2”
కోవెలలోని కానుకనేనై కోరికలోని వేడుకనీవై
జతకలిసి నిలచి జీవింపదలచి కార్చితివి నీ రుధిరమే
నీత్యాగ ఫలితం నీ ప్రేమ మధురం నా సొంతమే యేసయ్యా -“జీవప్రధాతవు”
2. నేనేమైయున్న నీకృపకాదా నాతోనిసన్నిధిని పంపవా “2”
ప్రతికూలతలు శృతిమించినను
సంధ్యాకాంతులు నిదురించినను
తొలివెలుగు నీవై ఉదయించి నాపై నడిపించినది నీవయ్యా
నీ కృపకునన్ను పాత్రునిగాచేసి బలపరచిన యేసయ్యా – “జీవప్రధాతవు”
3. మహిమనుధరించిన యోధులతోకలిసి
దిగివచ్చెదవు నా కోసమే “2”
వేల్పులలోనా బాహుఘనుడవు
నీవు విజయవిహరుల ఆరాధ్యూడవు
విజయోత్సవముతో ఆరాధించెదను అభిషక్తుడవు నీవని
ఎనాడూ పొందని ఆత్మభిషేకముతో
నింపుము నా యేసయ్యా. – “జీవప్రధాతవు”

