దరువెయ్యరా ఏసు వుట్టిండని – Daruveyara Yesu Puttindani Telugu christmas song
అర్ధరాత్రి సుక్కబుట్టె
ఊరువాడ ఎలాగ బట్టే
ముసలవ్వ మురువాబట్టే
పిల్ల జెల్లా ఆడ బట్టి
దరువెయ్యరా ఏసు వుట్టిండని
సిందేయ్యరా సామి ఏలిసిండని
సల్లనిసుపులోడక్క – సూడ సక్కనోడక్క
మచ్చలేని మా రాజు – రచించ వచ్చే
రాయే రాయే రాయే అన్న సందడి సేద్దాం రాయే
రాయే రాయే రాయే అక్క పండుగ సూద్దాం రాయే
మన సికటి బతుకులల్లా – ఏలుగంత నింపేందుకు
సికుసింత తీర్చేటోడు – మన అయ్యపుట్టెను
ఈగ సంబరంగా ఈ ముచ్చట పల్లె పల్లె చాటుదాం
గుండె గుండెకు చేరేటట్టు – గొంతెత్తి పాడుదాం
రాయే రాయే రాయే అన్న సందడి సేద్దాం రాయే
రాయే రాయే రాయే అక్క పండుగ సూద్దాం రాయే
ఈ సల్లని రాత్రిపూట మన దొర పుట్టెను
ప్రేమను పంచే టోడు తోడై నిలుసుండేటోడు
ఈగ పిల్ల పెద్ద అవ్వ తాత ఆడి పాడి ఎగరాలే
గడప గడప దాటోచ్చి జై జైలు కొట్టాలే
రాయే రాయే రాయే అన్న సందడి సేద్దాం రాయే
రాయే రాయే రాయే అక్క పండుగ సూద్దాం రాయే… దరువెయ్యరా




