
maa hrudhayamulalo lyrics – మా హృదయములలో దేవుని
maa hrudhayamulalo lyrics – మా హృదయములలో దేవుని
మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి
మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా
ఆనందించెదము ఎల్లప్పుడు ఆనందించెదము
ఆనందించెదము మేము ఆనందించెదము
నీవిచ్చిన రక్షణను బట్టి ఆనందించెదము
మాకిచ్చిన నిత్య జీవమును బట్టి ఆనందించెదము
యేసు యేసు నీ ద్వారనే
మేము దేవునితో సమాధానము కలిగియుంటిమి
యేసు యేసు నీ వలనే కదా
మేము నీతోడి దేవునికి వారసులమైతిమి
మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించితివి
మా హృదయములలో వసించుచున్న పరిశుద్ధుని ద్వారా
1.ఘోర పాపులము నీ తట్టు తిరిగితిమి
కృపను చూపితివి పరిశుద్ధపరిచితివి
మా అపరాధముల కొరకు అప్పగింపబడి
మము నీతిమంతులుగా తీర్చుటకు లేపబడినావు
మాకు నిత్య స్వాస్థ్యము నిశ్చయతను ఆనుగ్రహించుటకు
పరిశుద్ధాత్మను సంచకరువుగా మాలో నింపితివి
2.శ్రమల కాలములో శోకముల గడియలలో
నీ ప్రేమ మది తలచి ఆదరణ పొందెదము
మేమికను పాపులముగా నుండగానే ప్రభూ
మా కొరకు సిలువలో ప్రాణమును పెట్టితివి
మేమిపుడు ఇంకేమి నిన్ను కోరెదము
ఏ స్థితిలోనైనా నీలో ఆనందించెదము
maa hrudhayamulalo telugu christian lyrics
యేసు మన పాపములను క్షమించాడు. అంతమాత్రమే కాదు ఆయన మనలను నీతిమంతులుగా తీర్చాడు, మనకు తండ్రితో సంధి కుదిర్చి దేవునికి ఆయన తోడి వారసులుగా అగుటకు కారణమయ్యాడు. మనము ఆయన సొత్తు అనే నిశ్చయతను మరియు ఆయన వాగ్ధానము చేసిన నిత్య స్వాస్థ్యమునకు నిశ్చయతను ఇవ్వడానికి మనకొరకు పరిశుద్ధాత్మను సంచకరువుగా అనుగ్రహించాడు. ఇంక మనకు ఇప్పుడు ఏమి కావాలి? రండి! ఇక ఏ స్థితిలోనైనా ఆయనయందు ఆనందించెదం!!