పని చేస్తే పరలోకం నీదేలే – Pani ceste paralokam nidele
పని చేస్తే పరలోకం నీదేలే – Pani ceste paralokam nidele
పని చేస్తే పరలోకం నీదేలే..
పని మాత్రమే చేస్తె పరలోకం నీది కాదులే..
బోధిస్తే పరలోకం నీకేలే..
బోధ మాత్రమే చేస్తె పరలోకం నీకు లేదులే..
నీతిన్యాయాలు జరిగించాలి..
భక్తిప్రవర్తన కలిగుండాలి..!
సత్యవాక్యాన్ని ప్రకటించాలి..
క్రీస్తునే నీలో చూపించాలి..!!
చరణం:
అడగకుండానె పొలమమ్మారు..
దేవుని కొరకాలోచించారు
ఇరువురూ.. దంపతులిరువురూ..
ఆస్తి త్యాగాన్ని చేసే పనిలో ఆశ చంపుకోలేకున్నారు
ఇరువురూ… ప్రాణమె ఒదిలారూ..
ఈ నేల తనది కాదా..? నీ ఆస్తి తనది కాదా..?
నువ్వు ఇవ్వకుంటె తనకు లేదా..?
నీ హృదయాన్నే తను కోరలేదా..?
చరణం:
కోట్లమంది క్రైస్తవులున్నారు..
క్రీస్తు మాటలసలినకున్నారీ
మనుషులూ.. పేరుకె భక్తులూ..
పాప కార్యములనసలే ఒదలక..
ఆదివారమాలయముకు మానని
భక్తులూ.. శిక్షకు పాత్రులూ..
యేసుతోటి తిరగలేదా..?
ఆ ఇస్కరియోతు యూదా…
పనిలో పాలుపొందలేదా..?
ఉరి పోసుకుని నరకముకు పోలేదా..?
ముగింపు పల్లవి:
పని చేస్తే పరలోకం నీదేలే..
పని మాత్రమే చేస్తె పరలోకం నీది కాదులే..
లోక పాపాలనెధిరించాలి..
హృదయశుద్ధితో పయనించాలి..
శత్రువును కూడ ప్రేమించాలి..
చివరివరకు కొనసాగించాలి..
హృదయంలో మలినాన్ని మొదట కడుగులే..!
మారుమనసు పరలోక పయనానికి తొలిమెట్టులే..!
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."