Sarvonathuda – సర్వోన్నతుడా

Faith Score0
Faith Score0

Sarvonathuda – సర్వోన్నతుడా

సర్వోన్నతుడా! విజయవీరుడ

సర్వోన్నతుడ! విజయవీరుడ ప్రియుడ నా శిల్పకారుడ ఎవ్వరు లేరు నాకు యేసయ్యా నీ సన్నిది చాలు నాకు మేసయ్యా 2

అ.ప: ఇంతకంటె భాగ్యమంటయ్యా నాకు నీకంటె ఘనులెవరయ్యా – 2

1.గడచిన కాలంలో కనురెప్పలా
నీ చాటున దాచిన నా గొప్ప కాపరి }2
వేల్పులలో నీవు మహనీయుడవు -2 నన్నెన్నడు యెడబాయని తండ్రివినీవే
నా తండ్రివి నీవే ॥ఇంత॥

2. దయగలదేవుడవీ ధరణీయందున వ్యర్ధుడు చెరపలేడు నా క్షేమమును 2
నే గాడాంధకారపు లోయలో
నడిచినను – 2
నీ దుడ్డు కర్ర ధండము ఆధరించునే నన్నాదరించునే ॥ఇంత॥

3. రాబోవు శ్రేష్ఠమైన రాజ్యము కొరకు
వెనుదీయక గురి యొద్దకు సాగివెళ్ళదన్
నిర్జీవ గడియలు నిలదీసినగాని 2
నా మనస్సు నీపైనే ఆనుకొందునే
నే నాను కొందునే }2 ॥ఇంత॥

4. విమర్శలకు కృంగను నా హృదయమందున
నా స్థితిని మార్చేస్తుతి పాత్రుడుండంగ పునరుద్ధానుడ నా పితరులదేవా – 2 జయమునిచ్చు క్షేత్రములో యాత్ర చేసెదన్
నే యాత్ర చేసిదన్. ॥ఇంత॥

Sarvonathuda Telugu Christian Song lyrics

 

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo