velasenule song lyrics – వెలసెనులే గగనాన తూర్పుతార

Faith Score0
Faith Score0

velasenule song lyrics – వెలసెనులే గగనాన తూర్పుతార

scale – D# ; Signature – 2/4 Triplet ; Tempo – 113

వెలసెనులే గగనాన తూర్పుతార – నిశీధిరేయి జాములో
కురిసెనులే జగాన ప్రేమధార – రక్షకుడేసు జన్మలో
క్రిస్మస్ కాంతులే లోకాన వెలిగెనే – ప్రభుయేసే జన్మించగా
కన్యకు పుట్టేనేడు పరిశుద్ధుడే – దీనులు ధన్యులాయెనే

“శుభవార్త దూతదెల్పగ – ఆ గొల్లలే గంతులేసేనే
లోకాన రక్షణానందమే – పరలోకానా సంగీతమాయెనే ”

1. తరించిపోయే ఆ తూర్పు జ్ఞానులు – తీరాలు దాటి నిను చూడగా
బంగారు సాంబ్రాణి బోళములర్పించి – నమస్కరించి పూజించిరి
రారాజే రక్షకుడై మనకోసం జన్మించెనని

2. జగాలనేలే జయశీలుడేసే – జీవాధిపతిగా జనియించెనే
శరీరధారై పరిశుద్ధుడేసే – పశుశాలలోన పవళించెనే
జయగీతం పాడి – కీర్తించి కొనియాడెదము

3. మా పాపభారం భరియించెనే – మా దుఃఖ్ఖ దోషం తొలగించెనే
మన్నించి మమ్ము క్షమియించెనే – కరుణించి మాపై కృపచూపునే
మనసున్న మహారాజై – మా మదిలో ఉదయించెనే

velasenule song lyrics, velasenule lyrics, velasenule christmas song lyrics, velasenule Telugu christmas lyrics

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo