Vinare o narulaaraa telugu christmas song lyrics – వినరేయొ నరులారా

Faith Score0
Faith Score0

Vinare o narulaaraa telugu christmas song lyrics – వినరేయొ నరులారా

వినరే యో నరులారా – వీనులకింపు మీర
మనల రక్షింప క్రీస్తు – మనుజావతారుడయ్యె – వినరే
అనుదినమును దేవుని తనయుని
పద వనజంబులు మనముననిడికొనుచును

  1. నర రూపు బూని ఘోర నరకుల రారమ్మని
    దురితము బాపు దొడ్డ – దొరయౌ మరియా వరపుత్రుడు
    కర మరు దగు కల్వరి గిరి దరి
    కరిగి రయంబున ప్రభు – కరుణను గనరే
  2. ఆనందమైన మోక్షమందరికియ్య
    దీక్ష బూని తన మేని సిలువ మ్రానునణచి మృతిబొందెను
    దీన దయాపరుడైన మహాత్ముడు
    జానుగ యాగము – సలిపిన తెరంగిది
  3. పొందుగోరిన వారి విందా పరమోపకారి
    యెందరెందరి బరమానంద పదమొందగ జేసెను
    అందమునన్ దన బొంది సురక్తము
    జిందెను భక్తుల డెందము గుందగ

4.ఇల మాయావాదుల మాని – యితడే సద్గురుడని
తలపోసి చూచి మతి నిశ్చల భక్తిని గొలిచిన వారికి
నిల జనులకు గలుములనలరెడు
ధనికులకందని సుఖములు మరి యొసగును

  1. దురితములణప వచ్చి – మరణమై తిరిగి లేచి
    నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదుగ జనె
    బిరబిర మనమందర మా
    కరుణాశరనిధి చరణమే – శరణని పోదము
We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo