vinuveedhi nundi – వినువీధి నుండి వినబడనొక వార్త
పల్లవి÷వినువీధి నుండి వినబడనొక వార్త
విశ్వమంత వినిపించు వింతైన వార్త 2
విన్నారు ఆ గొల్లలు_ విశ్వసించారు ఆ జ్ఞానులు2
లోకానికిదియే శుభవార్త_ మనకులేదింక ఇంతకన్నా ఘనవార్త2
హల్లెలూయ హల్లెలూయ హల్లేలూయ 2
హల్లేలూయ హల్లెలూయ 2
1, వడిగా వడివడిగా నడిచారు వారంతా
కలిగిన విలువైన కానుకలతో ప్రభు చెంత 2
వరరాజు తనయుని ఈ శుభవార్త
వాడ వాడల చాటిరి బ్రతుకంతా 2# హల్లెలూయ #
2,సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులకిల నిరతం సమాధానమనుచు 2
స్తుతి పాడిన దూతాళి గీతాలతో
నింగి నేల ఉప్పొంగి పరవశించెను 2# హల్లెలూయ#

