Yesayya Neela Rakshana – యేసయ్యా నీలా రక్షణ
Yesayya Neela Rakshana – యేసయ్యా నీలా రక్షణ
పల్లవి: యేసయ్యా నీలా రక్షణ ఇచ్చేవారు
ఎవరున్నారు ఈ లోకంలో
నీలా నిత్య జీవమునే ఇచ్చేవారు
ఎవరున్నారు ఈ లోకంలో ॥2॥
అనుపల్లవి: నా మార్గము నా జీవము నా సత్యము నీవే
నా శైలము నా దుర్గము నా కేడెము నీవే ॥2॥
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
వందనం యేసయ్య నీకే ఆరాధన ॥2॥
1 చరణం: నన్ను ప్రేమించావు నాకై ప్రాణం పెట్టావు
నా తల్లి తండ్రి బంధువులే స్నేహితులే ॥2॥
ప్రాణం పెట్టగలరా నీలా యేసయ్య
చూపగలరా నీలాంటి ప్రేమను ॥2॥
॥ నా మార్గము ॥
2 చరణం: నన్ను ఆదరించావు బలపరిచి నిలిపావు
వ్యాధి బాధలలోను కష్టాలలోను నష్టాలలోను ॥2॥
నెమ్మదినిచ్చావు నను నడిపించావు
చూపగలరా ఈలాంటి ప్రేమను ॥2॥
॥ నా మార్గము ॥
3 చరణం: నా పాపములను కడిగావు పరిశుద్ధతనిచ్చావు
ఈ లోకంలో ఎంత వెదికినా ఎవ్వరిని అడిగినా ॥2॥
చేయగలరా పరిశుద్ధులుగా చూపగలరా ఈలాంటి ప్రేమను
చేయగలరా పరిశుద్ధులుగా చూడగలరా నీలాంటి శుద్ధుడను ॥2॥
నా మార్గము నా జీవము నా సత్యము నీవే
నా శైలము నా దుర్గము నా కేడెము నీవే ॥2॥
ఆరాధన…………..॥8॥
Yesayya Neela Rakshana Echevaaru Telugu Christian Worship Song from House of Hope Church.
- నీలా ప్రేమించే – Neela Preminche song lyrics
- నను నీలా ప్రేమించేలా ఎవరూ లేరయ్యా – nanu nila premincela
- Neela Vaanil Neenthum Nilavae Christmas Song Lyrics
- Ravikoti Thejudu – నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు
- నీల లేరెవరు – Neela Lerevaru
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."