Yesayya Neela Rakshana Telugu Christian Song Lyrics – యేసయ్యా నీలా రక్షణ
పల్లవి: యేసయ్యా నీలా రక్షణ ఇచ్చేవారు
ఎవరున్నారు ఈ లోకంలో
నీలా నిత్య జీవమునే ఇచ్చేవారు
ఎవరున్నారు ఈ లోకంలో ॥2॥
అనుపల్లవి: నా మార్గము నా జీవము నా సత్యము నీవే
నా శైలము నా దుర్గము నా కేడెము నీవే ॥2॥
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన
వందనం యేసయ్య నీకే ఆరాధన ॥2॥
1 చరణం: నన్ను ప్రేమించావు నాకై ప్రాణం పెట్టావు
నా తల్లి తండ్రి బంధువులే స్నేహితులే ॥2॥
ప్రాణం పెట్టగలరా నీలా యేసయ్య
చూపగలరా నీలాంటి ప్రేమను ॥2॥
॥ నా మార్గము ॥
2 చరణం: నన్ను ఆదరించావు బలపరిచి నిలిపావు
వ్యాధి బాధలలోను కష్టాలలోను నష్టాలలోను ॥2॥
నెమ్మదినిచ్చావు నను నడిపించావు
చూపగలరా ఈలాంటి ప్రేమను ॥2॥
॥ నా మార్గము ॥
3 చరణం: నా పాపములను కడిగావు పరిశుద్ధతనిచ్చావు
ఈ లోకంలో ఎంత వెదికినా ఎవ్వరిని అడిగినా ॥2॥
చేయగలరా పరిశుద్ధులుగా చూపగలరా ఈలాంటి ప్రేమను
చేయగలరా పరిశుద్ధులుగా చూడగలరా నీలాంటి శుద్ధుడను ॥2॥
నా మార్గము నా జీవము నా సత్యము నీవే
నా శైలము నా దుర్గము నా కేడెము నీవే ॥2॥
ఆరాధన…………..॥8॥
Yesayya Neela Rakshana Echevaaru Telugu Christian Worship Song from House of Hope Church.
