Yesu Chavonde Siluvapai – యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
యేసు చావొందె సిలువపై నీ కొరకే నా కొరకే
ఎంత గొప్ప శ్రమ నోర్చెను నీ కొరకే నా కొరకే
నదివలె యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగె మలినంబు తుడిచె
ఆ ప్రశస్త రక్తమే
నే నీ పాపము లొప్పుకో
నీ పాప డాగులు తుడుచుకో
నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో
క్రీస్తు యేసు రక్తములో
పాప శిక్ష పొంద తగియుంటిమి
మన శిక్ష ప్రభువే సహించెను
నలుగగొట్టబడె పొడువబడె నీకై
అంగీకరించు యేసుని

