Yesukreesthu Jananam Lyrics – యేసుక్రీస్తు జననం
“యేసుక్రీస్తు జననం
మానవాళికి పర్వదినం” “2”
“చీకటి తెరలు మటుమాయం
ఈ జగతికే ఉషోదయం” “2”
” యేసుక్రీస్తు జననం “
1.”పాపము నిండిన లోకంలో
శాపము ఏలిన బ్రతుకులలో” “2”
“పాపమునుండి విడిపించుటకు
శాపములన్ని తొలగించుటకు” “2”
“క్రీస్తు నరునిగ అవతరించెను” “2”
” యేసుక్రీస్తు జననం “
2.”రక్షణలేని మనుజులకు
నిరీక్షణలేని వారలకు” “2”
“కృపతో రక్షణ దయచేయుటకు
విశ్వాసంలో స్థిరపరచుటకు” “2”
“క్రీస్తు నరునిగ అవతరించెను” “2”
” యేసుక్రీస్తు జననం “
3.”వ్యాధిబాధలలో పడియున్న
మనసులో నెమ్మది లేకున్న” “2”
“శీఘ్రమే స్వస్థత కలిగించుటకు
శాంతి నిత్యం స్థాపించుటకు” “2”
“క్రీస్తు నరునిగ అవతరించెను” “2”
” యేసుక్రీస్తు జననం “
- Santhiki Duthaga Premaku Murthiga Lyrics – శాంతికి దూతగా ప్రేమకు మూర్తిగా
- Koniyada Tharame Ninnu – కొనియాడఁ దరమె నిన్ను
- రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ – RARAJU PUTTADOI Lyrics
- Nazarethu patnana nagumalle dharani lo-Telugu Christmas Mashup
- Christmas Vela Poduguke betlemulo Lyrics – పొద్దుగూకె బెత్లేములో ఊరువాడా తార వెలుగులో

