ఆకాశ వీధిలో కాంతులు చిందగా – Aakasha veedhilo
ఆకాశ వీధిలో కాంతులు చిందగా
కన్నుల విందుగా వెలిగెను తారొకటి
1. గొల్లలు జ్ఞానులు చేరిరి యేసుని
కానుకలిచ్చిరి ప్రేమను పొందిరి
ఆనందమాయెగా పాపము పోయేగా
పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
2. పాపపు బ్రతుకులో రక్షణ కలుగును
పాపపు బాటను వీడిన తోడనే
ఆనందమాయెగా పాపము పోయేగా
పరము వీడి భువికి దిగిన యేసుని కొలువ
