అలా కడలిలో అలా – Alaa Kadalilo Alaa song lyrics

Faith Score+2
Faith Score+2

అలా కడలిలో అలా – Alaa Kadalilo Alaa song lyrics

అలా.. కడలిలో అలా.. ఎగసిపడుతూ.. పరుగులిడుతూ..
తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా..?
ఎలా.. జరుగుతోందిలా.. చిలిపి కోయిలా.. పసిడి వెన్నెలా..
తెలుసునా నీకైన ఈ వింత ఏమిటిలా..?
చిత్రమే.. ఆధ్యంతమీ లోకము – ప్రశ్నలే.. ఏవైపు చూసినా..
అందదే.. ఈ పంచభూతాల తీరు – పూర్తిగా.. మనిషికెంత వెతికినా..
ఆశ్చర్యం.. కలిగించే.. ఈ సృష్టి యావత్తు రమ్యమే!
11 అలా 11

ఈ భూమి తిరుగుతున్నది – నువ్వు బ్రతకాలనీ.. ఇలలొ నిలవాలనీ
ఆ చెట్టు ఎదుగుతున్నది – నీడనివ్వాలనీ.. తోడుగుండాలనీ..

(కలిగియున్నదేది క్రీస్తు లేకుండ కలుగలేదు…)

ఏడు రంగులెందుకున్నవి? – నువ్వు చూడాలనీ.. పరవశించాలనీ..
ఎండ వానలెందుకున్నవి? – నేల పండాలనీ.. కడుపు నిండాలనీ..
కొండలూ.. కోనలూ.. ఎన్నెన్నో – వాగులూ.. వంకలూ.. ఇంకెన్నో..
పువ్వులూ.. కాయలూ.. అవిఎన్నో – పక్షులూ.. చేపజాతులెన్నెన్నో..
లెక్కలే..నన్ని జీవులే.. ఈ నేలపై.. నీ తండ్రి నీకు చేసెనే…
11 అలా 11

చిన్ని నవ్వులెందుకున్నవి? – ముద్దులాడాలనీ..మురిసిపోవాలనీ..
చిట్టి చీమలెందుకున్నవి? – పెద్ద లోకానికే.. లెక్చరివ్వాలనీ..

(కలిగియున్నదేది క్రీస్తు లేకుండ కలుగలేదు…)

ఇంత వాటరెందుకున్నది? – గొంతు తడవాలనీ.. దప్పి తీరాలనీ..
గింజ చచ్చి బ్రతుకుతున్నది – సర్వలోకానికే.. విద్య నేర్పాలనీ..
గర్భమందు ఎముకలెదిగె తీరేంటో.. సూర్యుడారకుండ మండడమేంటో..
గాలి యేడనుండి తరలి వస్తుందో.. పురుగు చిలుకలాగ మారె కథేంటో..
స్పేసుకే.. శాటిలైటులే.. పంపగలిగినా.. ఈ సైన్సుకైన తెలుసునా..

అలా.. కడలిలో అలా.. ఎగసిపడుతూ.. పరుగులిడుతూ..
తీరాన్ని చేరాక ఆగేది ఎందుకలా..?
ఎలా.. జరుగుతోందిలా.. చిలిపి కోయిలా.. పసిడి వెన్నెలా..
తెలుసునా నీకైన ఈ వింత ఏమిటిలా..?
చిత్రమే.. ఆధ్యంతమీ లోకము – ప్రశ్నలే.. ఏవైపు చూసినా..
ఆన్సర్ యేడ ఉందని వెతికితే – అందెనే అద్భుతాల గ్రంథమే..
చూసాను.. చదివాను.. ఈ సృష్టి ఆదైవకార్యమె
11 అలా 11

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo