Ascharyame – ఆశ్చర్యమే నాపై యేసయ్య

Faith Score0
Faith Score0

Ascharyame – ఆశ్చర్యమే నాపై యేసయ్య – ఆశ్చర్యమే నాపై యేసయ్య

ఆశ్చర్యమే నాపై యేసయ్య కృప చూపుట
ఏకోసన నాలో మంచేది లేకున్నను “2”
దయచూపిన దైవపుత్రుడా
నా ధన్యత నీ కృపయే కదా “2”

ఆనాటి నా గతము బహు ఘోరహీనము
నాతోటి వారికి ఎగతాలినైతిని “2”
కరుణామయ నన్ను కరుణించుచు
కనికరమే నాపై చూపావయ్య “2” “ఆశ్చర్యమే”

పరిశుద్ధమైన నీ మాటకు నేనెంతో దూరమైతిని
నాలోని క్రియలన్నియు బహు ఘోరపాపములే “2”
ఈ పాపికై భూవి దిగివచ్చిన
నా యేసు నాథా నా రక్షకా “2” “ఆశ్చర్యమే”

నీ చేతిలో దీపమై నను ఉంచిన యేసయ్య
చీకటి బ్రతుకులను వెలిగించే జ్యోతిలా “2”
నను మర్చవయ్య ఇలా ఉంచావయ్య
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్య “2”

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo