Inta Kalam Telugu Christian Song Lyrics, Written and Sung by Anil Vemula & Anand, Sirisha – ఇంత కాలం
ఇంత కాలం మీ కృపయే కారణం
ముందున్న కాలం ఆ కృపయే నా ధైర్యం //2//
జడియను వెనుదిరుగను – జారిపోను గురితప్పను
ముందుకు సాగెద – నా ప్రియ యేసుతో
॥ఇంత॥
వెనుకటి దినముల – వెనుదిరిజూడగ
వివరింపగనీ – విస్తృతకృపలను
ఎరుగని త్రోవలన్ – నడిపిన దైవమా
అలసిన వేళలో – జతకలసిన స్నేహమా //2//
ఏమనీ …. ఎన్ననీ……. //2//
లెక్కకు మించిన – నీ ఘనకార్యములు //2//
॥ఇంత॥
గడచిన కాలము – గతితప్పిన దినములు
నీ క్షేమకరముతో – నను నిలిపిన క్షణములు
వాక్యపు వెలుగులో – సరిచేసిన దైవమా
క్షమియించుటలో – ఉన్నత శిఖరమా //2//
ఎవరనీ… నేనెంతనీ …. //2//
ఊహించగలనా- నీ ప్రేమపరిధులు //2//
॥ఇంత॥
Inta Kalam Lyrics in English
Inta Kalam Song Lyrics, ఇంత కాలం Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the song lyrics for ‘Inta Kalam’, written and sung by Anil Vemula & Anand, Sirisha.
- The lyrics express gratitude for divine grace and support during challenging times.
- The song highlights the themes of faith, strength, and love within a Christian context.
- Additionally, the article includes a note about the publication by World Telugu Christians, which covers various Christian songs and resources.
Estimated reading time: 2 minutes

