నీ కృపయే నా జీవితము – Nee Krupaye Naa Jeevithamu

Faith Score-1
Faith Score-1

నీ కృపయే నా జీవితము – Nee Krupaye Naa Jeevithamu Telugu Christian song lyrics, written tune and sung by Sirisha Grace

ఎంత కృప చూపావు – యోగ్యతలేని నాపైన
ఏముంది నీ కృప తప్ప – నా జీవితములో యేసయ్య
నీ కృపయే – నా జీవితము
నీ కృపయే – నాకు ఆధారము
నీ కృపయే నీదు కృపయే – నాకు ఊపిరిని పొసేనయ్యా
నీ కృపయే నీదు కృపయే – నాకు చాలును యేసయ్య

  1. నా దేహము క్షీణించి ఆఖరి సమయాన – మరణము తప్పించెనే
    నీ కృపయే జీవముతో లేపెనే

కదలలేక నా అడుగు నడువలేని సమయాన – నన్ను బలపరిచెనే
నీ కృపయే అడుగులు స్థిరపరిచెనే
ఊపిరి ఉందంటేనే నీ కృపయే
చాలయ్య నా దేవా నీ కృపయే

  1. నా హృదయము గాయముతో కృంగిన సమయాన – నన్ను ఓదార్చేనే
    నీ కృపయే గాయమును మాన్పేనే

ఆశల నా దీపం ఆరిన సమయాన – నన్ను దర్శించేనే
నీ కృపయే నన్ను వెలిగించేనే

నాకున్న నా ధైర్యం నీ కృపయే
చాలయ్యా నా దేవా నీ కృపయే
నాకున్న నాధైర్యం నీ కృపయే
చాలయ్య నా దేవా నీ కృపయే

  1. పాడలేక నా స్వరము ఆగిన సమయాన –
    ఆత్మీయ గీతముతో
    నీ కృపయే స్తుతిచేయు కృపనిచ్చెనే

తల్లి గర్భములో రూపింపక మునుపే – నన్ను పిలిచితివే
నీ కృపతో సేవలో నిలిపితివే
చావైనా బ్రతుకైనా నీ సేవనే
నీ కృపతో చేసేదను నా యేసయ్య

Nee Krupaye Naa Jeevithamu song lyrics in English

నీ కృపయే నా జీవితము song lyrics, Nee Krupaye Naa Jeevithamu song lyrics, Telugu songs

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo