Davidu pattanamandu Telugu Christmas Song Lyrics – దావీదు పట్టణమందు
దావీదు పట్టణమందు పుట్టాడు రక్షకుడు
నేడు మన కొరకు చూడగ రారండి
బెత్లహేము గ్రామంలో కన్యమరియ గర్భమందు
జన్మించెను లోక రక్షకుడు
రండయ్యో సందడి చేద్దం
రండయ్యో వేడుక చేద్దం
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
వీ విష్ యు మెర్రీ క్రిస్మస్
జ్ఞానులు వచ్చారు తారననుసరించి
బాల యేసుని చూడగా
బంగారము సాంబ్రాణి బోలమును
కానుకగ అర్పించి యేసుని పూజించి వెళ్ళారు ఆ జ్ఞానులు..
గొల్లలు వచ్చారు దూతవాక్కుతో
బాల యేసుని చూడగా
పొత్తి గుడ్డలతో చుట్టబడిన యేసుని
చూచి వారు సంబరపడి
చటించారు ఆ గొల్లలు…
పరలోక దూత సమూహము
చేరి కొలిచెను పసుశాలలో
సర్వొన్నతమైనా స్థలములలో
దేవునికే మహిమని ఆయనకే ఘనతని పాడారు ఆ దూతలు…
Song title: తార -1
Song: దావీదు పట్టణమందు SCALE-E , TEMPO-110, SIGNATURE -6/8
Production: horeb prayer ministries
founder & president – Dr D. Charles Steephen
Lyrics,tune&Vocals: D KING Shalem
Music: Prasanth Kumar
Mix & Master Sam K Srinivas

