ఎంత ప్రేమ నీదయా యేసయా – Entha Prema Needhaya
ఎంత ప్రేమ నీదయా యేసయా – Entha Prema Needhaya
ఎంత ప్రేమ నీదయా యేసయా
ఇంతయని నేను వెలకట్టలేనయా
అంతులేని ప్రేమ నీది యేసయా
ఎంత పొగిడినా ఋణము తీరదయ్యా
యేసయ్యా యేసయ్యా నీ ప్రేమ కొలుచుట సాధ్యమా వల్లకాదయా
ఏమని తెలుపను ఈ ప్రేమ జాడను శాశ్వతమైనది వింతైనది
లోకంలో ఎన్నో ప్రేమలున్ననూ
శోకంలో ఉండగా తోడుండవే
గాఢంగా ప్రేమించిన ప్రియులైననూ
చూడంగా కష్టాలలో దరి చేరరే
స్థితి ఏదైనా విడువని ప్రేమ
మృతి వరకైనా తోడుండే ప్రేమ
ప్రతి క్షణం వెన్నంటి ఆదరించు ప్రేమ
స్వార్థంతో నిండిన ఈ లోకంలో
స్వచ్ఛమైన ప్రేమను కనుపరచేదెవరు
చూచి చూడనట్లు నటించే ఈ భువిలో
వెదకి మరీ ప్రేమతో సంధించేదెవరు
వెదకని ప్రజకు దొరికిన ప్రేమ
వ్యథలను తీర్చి రక్షించిన ప్రేమ
ప్రేమించి ప్రాణాన్ని అర్పించిన ప్రేమ
Entha Prema Needhaya song lyrics
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
- Virigi naligina – విరిగి నలిగిన
- Adarincaledu nannu evvaru – ఆదరించలేదు నన్ను ఎవ్వరూ
- Nee Prematho – నీ ప్రేమతో
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."