మాటల్లోనే ఉంది జీవం మాటల్లోనే – Maatallone Undi Jevam
పల్లవి
మాటల్లోనే ఉంది జీవం మాటల్లోనే ఉంది నరకం
రక్షణలోకైనా శిక్షలోకైనా ఆ నోరే మనకు సాధనం
సాత్వీకమైన నాలుకకే నిత్యజీవము సొంతము
సాత్వీకుడైన క్రీస్తు రక్షణతోనే అది మనకు సాధ్యం
చరణం:1
తూటాకంటె ప్రమాదకరం మన నోటిమాటే కదా
ఆచితూచి మాట్లాడుట మన అందరికి మేలే కదా
కళ్లెం పెట్టని నోరైతే అది భక్తిహీనుల రీతే కదా
నిత్యజీవపు మాటలొలికిన క్రీస్తు మనకు మాదిరే కదా
చరణం:2
జీవరాశులన్నిటిలొ మాటలాడేది మనుషులైన మనమే కదా
నోరున్నది తండ్రిని ప్రార్థిస్తూ కీర్తించుటకే కదా
ఉప్పు వేసినట్లు మన మాటలు క్షేమానికె పలకాలి కదా
రక్షణ నొసగే క్రీస్తును చాటుటె మన నోటికి సార్థకం కదా

