Naa Korika Nee Pranalika – నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నాప్రార్థన విజ్ఞాపనా – నిత్యమహిమలో నిలవాలని
అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను
ఆశలవాకిలి తెరచినావు – అనురాగవర్షం కురిపించినావు
నాహృదయంలో ఉప్పొంగెనే – కృతజ్ఞతా సంద్రమే
నీసన్నిధిలో స్తుతిదృదయ కృతజ్ఞతా సంద్రమే నీసన్నిధిలో నాహృదయ భాగ్య నీసన్నిధిలో – నాహృదయ నీసన్నిధిలో నాహృదయ పాడిన పచూపి
గాఢాంధకారము
కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు
నన్నునీవువిడిపించినావు – ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన – సజీవుడవు నీవేనయ్యా
నాలో ఉన్నది విశ్వాసవరము – తోడైయున్నది వాగ్దానబలము
ధైర్యపరచి నడుపుచున్నవి విజయశిఖరపు దిశగా
ఆర్పజాలని నీప్రేమతో – ఆత్మదీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వీకుడా
స్వచ్ఛ నీవాక్యం – వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట
సిగ్గుపరచదు నన్నెన్నడూ – నీలోనకున్న నిరీక్షణ
వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా

