Nee Sannidhi – నీ సన్నిధి సహవాసము
నీ సన్నిధి – సహవాసము
నాలో నింపింది – ఆనందము
యేసయ్య నా బలమే నీవయ్యా
యేసయ్య నీ చెలిమి చాలయ్య
1) నీ మందిరములో – నివసించి నేను
స్తుతియాగమర్పించిన – చాలు
నీ దివ్య గానామృతం – నా జిహ్వకే మధురం
అదియే నా ధన్యము – అదియే ఆనందము
2) నీ దీవెనలతో – దర్శించి నన్ను
నా తొలకరి – జల్లువైనావు
నా జీవ జలధారవై – ప్రవహించు సెలయేరువై
చిగురింప చేసావు – వర్ధిల్ల చేసావు
3) దినమెల్ల నిన్ను – ఆరాధించి
ధ్యానింతు – నీ దివ్య వాక్యం
ఆనంద గానాలతో – తనువెల్ల పులకించగా
నిన్ను కీర్తించుచు – నిన్ను స్మరియింతును

