Nee Siluve Naaku – నీ సిలువే నాకు శరణం యేసుప్రభో

Faith Score+1
Faith Score+1

Nee Siluve Naaku – నీ సిలువే నాకు శరణం యేసుప్రభో

పల్లవి: నీ సిలువే నాకు శరణం యేసుప్రభో!
1. దురితదూరుడా – నీదరి జేరగ – నాదు పాప – శాపము దీర్చి దరిజేర్చితివి – కృపతో
2. ⁠శాశ్వతముగ నన్ను – ప్రేమించితివి – నీదు ప్రేమకు – నేనే సాక్షిని బలమగు నీదు – కృపతో
3. ⁠నా హృదయములో – భారములెల్లను – సిలువను జూడగ – సమసిపోయెను శక్తిగల నీ కృపతో
4. ⁠రక్తముకార్చి – మరణము గెల్చి – శత్రు సైతానును ఓడించి విజయమిచ్చితివి కృపతో
5. ⁠నీవు పొందిన – బాధలవలన – నిత్యసుఖంబులు – సంపూర్ణముగ పొందితి నీదు కృపతో
6. ⁠యేసు నా సిలు – వను నే మోసి – ఇలలో నిన్ను – వెంబడించుటకు ధైర్యమిచ్చితివి కృపతో
7. ⁠నీ రాకకై – నిరీక్షించు – నిత్యకృపను నే – పొందితినంచు పాడెదను హల్లెలూయ

Nee Siluve Naaku song lyrics

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo