Neekey Aaradhanaa song Lyrics – సర్వాధికారి సర్వము నీవే
సర్వాధికారి సర్వము నీవే
నా యేసు దేవ వందనము నీకే వందనము
మహోపకారి మహోన్నతుడ నీవే
నా యేసు దేవ ఆరాధన నీకే ఆరాధన
కృపయే దేవ బ్రతికించెను
నీ కృపయే దేవ నను కాచెను
కృపయే దేవ నను కాచెను
నీ కృపయే దేవ నను కాచెను
1. చీకటి బ్రతుకును మర్చినావు
నా జీవితాన్ని వెలుగుతో నింపావు
కృపయే కదా నీ కృపయే కదా
ఇంతవరకు నడిపించినది
కృపయే కదా నీ కృపే కదా
ఇంతవరకు నడిపించినది
ఇంతవరకు నడిపించినది
నన్ను ఇంతవరకు నడిపించినది
2. ఓడిపోయానయ్యా నా సొంత జ్ఞానముతో
నే తెలుసుకున్నానయ్యా నీవు లేక నేను లేనని
ప్రేమే కదా ప్రేమయే కదా
నన్ను నీలో నిలబెట్టేను
ప్రేమే కదా నీ ప్రేమయే కదా
నన్ను నీలో నిలబెట్టేను
నన్ను నీలో స్థిరపరచెను
నన్ను నీలో ఫలింపజేసెను
