Neeve Neeve Lyrics – నీవే నీవే నీవే మా ప్రాణం

Faith Score0
Faith Score0

Neeve Neeve Telugu Christian Song Lyrics – నీవే నీవే నీవే మా ప్రాణం

నీవే నీవే నీవే మా ప్రాణం
యేసు నీవే నీవే మా గానం
ఆశ్రయమైన ఆధారమైన నీ దివ్య ప్రేమ చాలయ్య
కొలుతుము నిన్నే యేసయ్య

1. శాశ్వతమైన నీ తొలి ప్రేమ – మార్గము చూపీ కాచే ప్రేమ
ఆదియు నీవే అంతము నీవే – నీ చరణములే శరణమయ

నిను పోలి ఇలలోన – ఒకరైన కనరారే
నివు లేని బ్రతుకంతా – యుగమైనా క్షయమేగా
విలువైన వరమేగా – నివు చూపే అనురాగం

కలకాలం విరబూసే – ప్రియమార స్నేహమే

నీ ప్రియ స్నేహం – ఆనందం
కొలుతుము నిన్నే ఆద్యంతం

2. ఊహకు మించిన నీ ఘన కార్యం – ఉన్నతమైన నీ బహుమానం
నీ కృపలోనే చూచిన దేవా – జీవనదాత యేసయ్య

కలనైనా అలలైనా – వెనువెంటే నిలిచావు
కరువైనా కొరతైనా – కడదాకా నడిచావు
ఇహమందు పరమందు – కొలువైన ప్రభు యేసు

ఎనలేని దయ చూపే – బలమైన నామమే

నీ ఘన నామం – మా ధ్యానం
కొలుతుము నిన్నే ఆద్యంతం

Neeve Neeve Lyrics in English

Neeve Neeve Song Lyrics,  నీవే నీవే నీవే మా ప్రాణం Lyrics

Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.

Key Takeaways

  • The article features the Telugu Christian song lyrics for ‘Neeve Neeve – నీవే నీవే నీవే మా ప్రాణం.’
  • It includes themes of divine love, protection, and the eternal nature of faith in Jesus.
  • The song expresses deep emotional connections and admiration for Jesus throughout.
  • Published by World Telugu Christians, it serves as a resource for Telugu Christian music and devotionals.

Estimated reading time: 2 minutes

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo