Ni Chethitho Nannu Pattuko – నీ చేతితో నన్ను పట్టుకో

Faith Score0
Faith Score0

Ni Chethitho Nannu Pattuko – నీ చేతితో నన్ను పట్టుకో

నీ చేతితో నన్ను పట్టుకో
నీ ఆత్మతో నన్ను నడుపు
శిల్పి చేతిలో శిలను నేను
అనుక్షణము నన్ను చెక్కుము (2)

అంధకార లోయలోన
సంచరించినా భయములేదు
నీ వాక్యం శక్తిగలది
నా త్రోవకు నిత్యవెలుగు (2)

ఘోరపాపిని నేను తండ్రి
పాప ఊభిలో పడియుంటిని
లేవనెత్తుము శుద్దిచేయుము
పొందనిమ్ము నీదు ప్రేమను (2)

ఈ భువిలో రాజు నీవే
నా హృదిలో శాంతి నీవే
కుమ్మరించుము నీదు ఆత్మను
జీవితాంతము సేవ చేసెదన్ (2)

We will be happy to hear your thoughts

Leave a reply

About Us

Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
Logo