Ningi Nela Pulakarincenu christmas song lyrics – నింగి నేల పులకరించెను

Faith Score0
Faith Score0

Ningi Nela Pulakarincenu christmas song lyrics – నింగి నేల పులకరించెను

పల్లవి

నింగి నేల పులకరించెను
రక్షకుడు ఇలలో జన్మించెను
నా ప్రేమామయుడా
నా కృపామయుడా
నా ప్రేమామయుడా-
కృపామయుడా
భక్తితో నిన్ను స్తుతియింతును
నన్ను నీకు అర్పింతును

కోరస్

ఇదియే నా ప్రేమార్పణ
ఇదియే నా హృదయార్పణ
భక్తితో నిను స్తుతియింతును
నన్ను నీకు అర్పింతును

చరణం 1

మిలమిల మెరిసే అందాల తార
అరుదెంచి నీజాడ చూపించెను
దివినుండి వచ్చిన దేవదూతలు
పాడిరి మహిమ గీతములు
ఇదిగో……. దేవా……….
నేనును నా హృదినర్పించెదను || కోరస్||

చరణం 2

వడివడిగ నిను చేరిన గొల్లలు
దర్శించిరి స్తుతులర్పించిరి
తూర్పునుండి వచ్చిన జ్ఞానులు
ఆరాధించిరి కానుకలర్పించిరి
ఇదిగో……. దేవా……….
నేనును నా సర్వమునర్పించెదను|| కోరస్||

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo