Ooruko Naa Praanama Lyrics – ఊరుకో నా ప్రాణమా – కలత చెందకు

Faith Score+1
Faith Score+1

Ooruko Naa Praanama Lyrics – ఊరుకో నా ప్రాణమా – కలత చెందకు

పల్లవి:-
ఊరుకో నా ప్రాణమా – కలత చెందకు
ఆనుకో ప్రభు రొమ్మున – నిశ్చింతగా – 2

అనుపల్లవి:-

ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన – 2
నా పక్షమందు నిలిచి – నా ముందరే నడిచి
నీ శక్తినే చాట – నన్నుంచెనే ఈ చోట
నిన్నెరుగుటే మా ధనం – ఆరాధనే మా ఆయుధం

1. ఎర్రసముద్రాలు – నా ముందు పొర్లుచున్న
ఫరో సైన్యమంతా – నా వెనుక తరుముచున్న-2
నమ్మదగిన దేవుడే – నడిపించుచుండగా
నడి మధ్యలో నన్ను – విడిచిపెట్టునా – 2

2. ఇంతవరకు నడిపించిన – దాక్షిణ్యపూర్ణుడు
అన్యాయము చేయుట – అసంభవమెగా – 2
వాగ్ధానమిచ్చిన – సర్వశక్తిమంతుడు
దుష్కార్యము చేయుట – అసంభవమెగా – 2

3. అవరోధాలెన్నో – నా చుట్టు అలుముకున్న
అవరోధాల్లోనే – అవకాశాలను దాచెగా – 2
యెహోవా సెలవిచ్చిన – ఒక్కమాటయైనూ
చరిత్రలో ఎన్నటికీ – తప్పియుండలేదుగా – 2

Ooruko Naa Praanama || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew || The Life Temple

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo