Samipinthunu – సమీపింతును సదాకాలము-ఓ ఘనుడా నీ
పల్లవి :
సమీపింతును సదాకాలము-ఓ ఘనుడా నీ సముఖమును
ఆరాధింతును ఆస్వాదింతును నీ మాటల మకరందము ||2||
||అ.ప.||
ఆరాధించెదను (3) నా యేసయ్యా (2)
సమీపింతును సదాకాలము-ఓ ఘనుడా నీ సముఖమును
1) నీ సన్నిధిలో నే చేరగానే – నా బాధలన్నియు తొలగెనయ్యా
నీ వైపు నేను చేతులెత్తగానే-నీ శక్తి నాలో నిండెనయ్యా ||2||
నెమ్మది కలిగెను భారమంత తీరెను ఎన్నడు పొందని అనుభవమే
ఆరాధించెదను (3) నా యేసయ్యా (2)
సమీపింతును సదాకాలము-ఓ ఘనుడా నీ సముఖమును
2) నీ బలిపీఠము సమీపించగానే నా హృదయవేదన తీరెనయ్యా
నీ పాదాలచెంత అంగలార్చగానే నాలో భయములు తొలగెనయ్యా ||2||
ధైర్యము కలిగెను, వేదనంత తీరెను ఎన్నడు పొందని అనుభవమే
ఆరాధించెదను (3) నా యేసయ్యా (2)
సమీపింతును సదాకాలము-ఓ ఘనుడా నీ సముఖమును
3) నీ ముఖ దర్శనం నాకు కలగగానే నా కఠిన హృదయం మారెనయ్యా
నీ జీవవాక్కు నన్ను తాకగానే నా బ్రతుకంతయు మారెనయ్యా ||2||
చీకటి తొలగెను వెలుగు నాకు కలిగెను ఎన్నడు పొందని అనుభవమే
ఆరాధించెదను (3) నా యేసయ్యా (2)

